తెలంగాణ తెలుగు పదాలు
- pnarahariias
- Sep 14
- 1 min read
Updated: Sep 16
గావురంగా
గావురంగా అనే పదం గౌరవంగా అనే పదానికి వికృతిగా అనిపిస్తుంది…!
కానీ గావురంగా మరియు గౌరవంగా పదాలకి చాలా తేడా ఉంది. గౌరవంగా - అంటే మర్యాదగా, ఆరాధనాభావంగా అని అర్థం
గావురంగా - అంటే ప్రేమగా, ప్రేమతో, ఆప్యాయతతో అని అర్థం
పద ప్రయోగం ఉదాహరణకి… తల్లిదండ్రులు ఒక్కగానొక్క ఆడపిల్లని గావురంగా పెంచిండ్లు…
రంది పెట్టుకోవడం
"రంది పెట్టుకోవడం" అంటే కంగారు పడటం, విసుగు చెందడం, విచారించడం లేదా ఏదైనా విషయం గురించి అధికంగా చింతించడం. ఈ పదాన్ని తరచుగా తెలుగులో ఏదైనా సమస్యాత్మక లేదా విసుగు కలిగించే పరిస్థితిని వివరించడానికి ఉపయోగిస్తారు.
ఉదాహరణలు:
రైతుల కష్టాలు: ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ఆలస్యం చేయడం వల్ల రైతులు కంగారు పడుతూ "రంది పెట్టుకుంటున్నారు".
ఆరోగ్య సమస్యలు: అనారోగ్యంతో ఉన్నవారు లేదా వారి బంధువులు కంగారు పడుతూ రంది పెట్టుకోవచ్చు.
కష్టమైన పనులు: ఏదైనా పనిలో ఇబ్బంది లేదా ఆలస్యం జరిగినప్పుడు కూడా "రంది" అనే పదాన్ని వాడతారు.
సంక్షిప్తంగా, "రంది పెట్టుకోవడం" అనేది ఒక రకమైన మానసిక అశాంతి లేదా ఆందోళనను సూచిస్తుంది.
Comments