అనంతమునకు తల్లిదండ్రులు
- pnarahariias
- Dec 26, 2025
- 1 min read
Updated: 3 days ago

మా మామగారు డిసెంబర్ 1న మధ్యాహ్నం అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయారు. ఎంతో ఆరోగ్యంగా ఎప్పుడూ వ్యాయామాలతో ఉత్సాహంగా ఉండే శ్రీకృష్ణ వాసు దేవరావు గారు అకస్మాత్తుగా చనిపోయారు. మొన్ననే దీపావళికి ఒక 15 రోజులు మా దగ్గర వుండి వెళ్లారు. ఆ పదిహేను రోజులు ఎంతో ఉత్సాహంగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ల తో ఎంతో ఆనందంగా ఉండే. ఎప్పుడు ఆరోగ్యం, కూరగాయలు, పండ్లు ఫలాలు, వ్యాయామం, ఆయుర్వేదం గురించి మాట్లాడే మా మావయ్య అలా చనిపోవడం బంధుమిత్రులకు ముఖ్యంగా ఎప్పుడూ వారి ద్వారా ఆరోగ్య సూత్రాలు విన్న వయోవృద్ధులకు ఆశ్చర్యంతో కూడిన దుఃఖ సాగరంలో ముంచాయి.
సెప్టెంబరు 2016లో మా నాన్నగారు, మార్చి 2018 లో మా అత్తగారు, డిసెంబరు 2020 లో మా మామగారు ఒకరి తర్వాత ఒకరు పరమపదించడం వారి పిల్లలు గా మమ్మల్ని తలపై క్షేత్ర ఛాయలు లేనివాళ్లుగా చేస్తుంది. వారి మహాప్రస్థానం పిల్ల లైన మమ్మల్ని బాధ్యతలకు మరింత దగ్గరిగా చేసి, వారి మాటలు చేష్టలు డిక్షనరీ రాతలుగా మారిపోతారు. మనకు కష్టం వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో ఒక్కసారి ఆ డిక్షనరీ చదువుకుంటే తెలుస్తాయి. వారు మనకు జీవితాల పాఠాలకు రిఫరెన్స్ మెటీరియల్ గా తయారవుతారు. వారు ఎన్నాళ్ళు జీవిస్తే అంతటి రిఫరెన్స్ మెటీరియల్ తయారవుతుంది మరి. కష్టాలు సుఖాలు ఒకటికొకటి పర్యాయలు, ఒకటి తరువాత ఒకటి చీకటి వెలుగు లాగా వస్తూపోతూ ఉంటాయి అని చెబుతారు.
జీవితాన్ని ఎలా జీవిస్తే సార్థకత ఎంత సింపుల్ గా, ఎంతో హంబుల్గా, ఉన్నదాంట్లో ఆనందంగా, అనవసర వాటికి పాకులాట లేకుండా సంతృప్తిగా జీవించడమే కదా జీవితం!











Comments