top of page

భగవత్ సంకల్పం

  • Oct 17, 2025
  • 2 min read

Updated: Nov 1, 2025


అన్ని రకాల కార్యక్రమాలకు లక్ష్యాలకు సంకల్పం చాలా అవసరం.  సంకల్పంతోనే  సిద్ది  ప్రాప్తి  జరుగుతుంది. సంకల్పం లేకుండా ఏ సిద్ది ప్రాప్తి కాదు. అదే  భగవత్సంకల్పం  ఉంటే  సిద్ది  ప్రాప్తి  తథ్యం. భగవంతుడు  అలాంటి  సంకల్పాలకు  తథ్యం  తథాస్తు  అంటాడు.


అలాంటి సంకల్పమే ఈ మధ్య కాలంలో ‘తెలుగు సంస్కృతిక పరిషత్తు’ భోపాల్ ద్వారా చేయడం జరిగింది. గత  నలభై  సంవత్సరాల  క్రితం  శారదా  మాత  మందిరం  నిర్మాణం  చేసి  తెలుగు  సంస్కృతి  ని  ధార్మిక  గతి  విధులను  నిర్వహిస్తూ  వస్తుంది. అయితే  తాత్కాలికంగా  నిర్మించిన  ఈ  మందిర  పునః  నిర్మాణం  చేయాలని  ఇక్కడి  అధికారులు  మరియు  పరిషత్  కార్యకర్తలు  ఎన్నో  సంవత్సరాలుగా  ప్రయత్నిస్తున్నారు  కానీ  ఏదో  ఒక  కారణం  చేత  ఏదో  తెలియని  ఆసక్తుల వల్ల  ఈ  నిర్మాణం  జరగ  లేదు. 17 సంవత్సరాలు  ఫీల్డ్  పోస్టింగ్  లో ఉండి  అనుభవం  గ్రహించి  నేను  ప్రమోషన్  పొంది  భోపాల్  నగరం  చేరుకున్నాను. పరిషత్  అధ్యక్షులు  కె  ఎస్  ఎన్  మూర్తి  గారు  ఈ  పునర్నిర్మాణం  గురించి  నాకు  కలిసినప్పుడల్లా  ఎప్పుడూ  చెప్పు  వస్తుండేవారు. పరిషత్  సెక్రెటరీ  శేఖర్  గారు  నాకు  ఈ  నిర్మాణం  గురించి  ప్రస్తావిస్తూ  వస్తుండేవారు. పరిషత్  ను  ఈ  స్థితికి  తీసుకు  వచ్చిన  మరియు  ఈ  మందిర నిర్మాణం  ఇక్కడ  ఒక  కమ్యూనిటీ  హాల్  నిర్మించిన  సీనియర్  అధికారులు  పెద్దలు  కూడా  పునర్నిర్మాణం  చేయాలని  చెపుతూ  వచ్చారు. అయితే  అందరూ  నిర్మించాలని  అనుకున్నారు  కానీ  ఎవరు  ఆ  స్థితి  వరకు  ఎందుకో  తీసుకు  రాలేక  పోయారు.


ఆగస్టు 2018 లో  శేఖర్  గారు  మూర్తి  గారు  మరియు  కిషోర్  నాయుడు  గారు  నాతో  కూర్చుని  మళ్లీ  ఈ  విషయ  ప్రస్తావన  తెచ్చి  పునర్నిర్మాణం  చేయాల్సిందే  అని  నాతో  చర్చించారు. అయితే  ఆ  రోజు  ఎందుకు  ఒక  నిర్ణయానికి  రావాలని  ఒక  తహతహ  నాలో  కలిగింది. ఇండోర్  జిల్లాలో  బీజా  సేన్  మాతా  మందిర్  జీర్ణోద్ధారణ  మాస్టర్  ప్లాన్  తయారు  చేసి  ఒక  నిర్ణీత  పరిస్థితికి  తీసుకువచ్చాక  ఇప్పుడు  ఇక్కడ  శారదా  మాత  మందిరం  నిర్మాణం  చేయాలని  సంకల్పం  మాలో  కలిగింది. అంతే  తెలుగువారైన  కాంట్రాక్టర్  కిషోర్  నాయుడుగారు  మందిర  నిర్మాణానికి  మొత్తం  ఖర్చు  తన  మనుషులను  పెట్టి  చేయిస్తానని  మిగతా  ఖర్చులు  నన్ను  పెట్టుకోవాలి  అని  నిర్ణయించుకుని  వెంటనే  భూమి  పూజ  కార్యక్రమాలు  చేపట్టాలని  నిర్ణయించుకున్నాము.  పరిషత్తు  సెక్రెటరీ  శేఖర్  గారు  అన్ని  రకాలుగా  కోఆర్డినేటర్  చేస్తూ  ఈ  భగవత్సంకల్పం  పూర్తి  చేసే  విధంగా  అక్టోబరు  నెలలో  భూమి  పూజ  కార్యక్రమం  కూడా  వెంటనే  చేయడం  జరిగింది.


ఒక్క రోజు కూడా అ కట్టడం ఆగలేదు. సంకల్పం ఎంత దృఢంగా ఉండేనంటే ప్రతి వస్తువు, మేస్త్రీలు, స్థాపతులు, పండితులు, దాతలు అందరూ ఈ నిర్మాణానికి కలిసి వచ్చారా? అన్నట్టుగా చకచకా జరిగిపోయాయి. ఇంతమంది  ఎక్కడో  కలిసి  నిర్మాణం  ఒక్క రోజు కూడా అ కట్టడం ఆగలేదు. సంకల్పం ఎంత దృఢంగా ఉండేనంటే ప్రతి వస్తువు, మేస్త్రీలు, స్థాపతులు, పండితులు, దాతలు అందరూ ఈ నిర్మాణానికి కలిసి వచ్చారా? అన్నట్టుగా చకచకా జరిగిపోయాయి. ఇంతమంది  ఎక్కడో  కలిసి  నిర్మాణం  చేయాలని  ఎప్పుడో  నిర్ణయించుకున్నారా? అన్నట్లుగా  అదేదో  ప్రాజెక్ట్  మేనేజ్మెంట్  టెక్నాలజీ  లో  పర్ట్  సిపిఎం  అనే  విధానాన్ని  ఎంతో  చాకచక్యంగా  అవలంబించినట్లు  నిర్మాణం  కేవలం  ఐదు  నెలల్లో  పూర్తి  అయ్యింది. అమ్మవారు  తనంతట  తానే  దగ్గరుండి  తన  మందిర  నిర్మాణాన్ని  మా  చేత  కట్టించుకున్నారా? అన్నట్లుగా పూర్తయింది. అయితే  గమ్మత్తు  ఏమిటంటే  మందిర  నిర్మాణం  పూర్తయినా ముహూర్తాలు లేక రెండు నెలలు ఆగి పునః ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా అమ్మవారి దీవెనలతో జరుపుకోవడం జరిగింది.చేయాలని  ఎప్పుడో  నిర్ణయించుకున్నారా? అన్నట్లుగా  అదేదో  ప్రాజెక్ట్  మేనేజ్మెంట్  టెక్నాలజీ  లో  పర్ట్  సిపిఎం  అనే  విధానాన్ని  ఎంతో  చాకచక్యంగా  అవలంబించినట్లు  నిర్మాణం  కేవలం  ఐదు  నెలల్లో  పూర్తి  అయ్యింది. అమ్మవారు  తనంతట  తానే  దగ్గరుండి  తన  మందిర  నిర్మాణాన్ని  మా  చేత  కట్టించుకున్నారా? అన్నట్లుగా  పూర్తయింది. అయితే  గమ్మత్తు  ఏమిటంటే  మందిర  నిర్మాణం  పూర్తయినా  ముహూర్తాలు  లేక  రెండు  నెలలు  ఆగి  పునః  ప్రాణ  ప్రతిష్ఠ  కార్యక్రమం  ఘనంగా  అమ్మవారి  దీవెనలతో  జరుపుకోవడం  జరిగింది.


అయితే ఇక్కడ సంకల్పం కంటే భగవత్సంకల్పం చాలా గొప్పది. భగవత్సంకల్పం  ఉంటే ఏ కార్యక్రమమైనా ఎంత కఠినాతి కఠినమైన నిర్మాణమైన, ఎలాంటి విద్యా, వృత్తిరీత్యా అభివృద్ధి అయినా, ఆరోగ్య రీత్యా మంచి జరగాలన్న అవ్వక తప్పదు. సంకల్పం సిద్ధించాలంటే భగవంతున్ని మనసారా ప్రార్థించి కార్యక్రమం అతి త్వరగా ప్రారంభించినట్లయితే సిద్ధి తధాస్తు!


పరికిపండ్ల నరహరి, ఐఏఎస్

June 2017

 
 
 

Comments


Hi, thanks for stopping by!

I am P Narahari, and this is my blog. I have worked in the government sector extensively, and would love to hear your thoughts - be it on this post or on any other topic which you think deserves to be discussed. 

  • Facebook
  • Instagram
  • Twitter
  • Pinterest

Share Your Thoughts with Narahari

Share your thoughts with Narahari

© 2025 by P. Narahari All rights reserved.

bottom of page