top of page

దారిపొంటత్తుండు దవ్వ దవ్వత్తుండు - మామిడి మౌనిక సంగీతంతో కథా కవితా విశ్లేషణ

  • Mar 13
  • 1 min read


ఈ మధ్య కాలంలో "ట్రీ మ్యూజిక్" ఛానల్ లో వచ్చిన పాట, మామిడి మౌనిక ద్వారా రాసి పాడిన మరియు ఎస్కె మదీన్‌ ద్వారా సంగీతం అందించిన ఈ పాట చాల వైరల్ అవుతుంది. ఈ పాట లో తెలంగాణ తెలుగు జానపద సాహిత్యం ఉట్టి పడుతుంది. ఇందులో వాడిన పదాలు అచ్చు తెలంగాణ యాసలో గ్రామీణ క్షేత్రాల్లో వాడే పదాలు.


ఇందులో ‘దవ్వ దవ్వత్తుండు’- అనేది చాల ఉత్సాహంగా దబ్బ డబ్బ వస్తుండు, తొందర తొందర వస్తుండు అని చెప్పడం. అదే విధంగా ‘రౌసు వెట్కుంటుండు’, అంటే కోపంతో ఊగి పోతున్నాడు, రగిలి పోతున్నాడు అనే ఎంతో బాధ తో చెప్పడం. గాలి గాలి సేత్తుండు, ఒర్రిచ్చి... ఒరిచ్చి..., అగ్గగ్గొ... అగ్గగ్గొ అనే పదాలు ప్రాస యాస కలగలిపిన సాహిత్యం.


చాలా మట్టుకు వాడుక భాషలో రాసిన ఈ పాట జానపద సాహిత్యం లోని తియ్యదనం తో పాటు అచ్చు తెలంగాణ అంబలి గడకఁ లాంటి రుచితో కూడుకున్న చాలా సింపుల్ భాషలో ఎంతో సున్నితమైన భావాలను తెలియజేస్తున్నదీ పాట.


ఒక ఆడ పిల్ల తనకోసమై వస్తున్న, తనపై ప్రేమ వ్యక్త పరుస్తున్న వ్యక్తికీ దారి ఇవ్వాళా వద్దా? అనే ఆలోచలంలో పాడిన పాట. ఆ వ్యక్తికీ తనపై ప్రేమ ఉందా లేదా అన్న సందిగ్ధంలో ఆ సన్నివేశాన్ని ఎంతో ఆనందిస్తూ పాడిన పాట.


తెలంగాణ జానపద గీతాలలో ఇలాంటి చిలిపి సన్నివేశాలతో, స్త్రీ పురుషుల మధ్య సంబంధాలను, బావ మరదళ్ల మధ్య సరసాలను, ఏంతో ఉత్సాహంతో పాడే పాటలుంటాయి. ఈ సాహిత్యమే తెలంగాణ జానపదానికి వెన్న ముఖ. ఈ జానపదాలే తెలంగాణ జీవనానికి ఎడతెగగా పారే గోదావరి.


24th Feb 2025



Comments


Hi, thanks for stopping by!

I am P Narahari, and this is my blog. I have worked in the government sector extensively, and would love to hear your thoughts - be it on this post or on any other topic which you think deserves to be discussed. 

  • Facebook
  • Instagram
  • Twitter
  • Pinterest

Share Your Thoughts with Narahari

Share your thoughts with Narahari

© 2025 by P. Narahari All rights reserved.

bottom of page