గులామీ మరియు గౌరవం మధ్యలో తేడా
- Oct 31, 2025
- 2 min read
Updated: Nov 25, 2025

గౌరవ మర్యాదలు మన సంస్కృతికి నిదర్శనం. పెద్దలను గౌరవించడం, ఉన్నత స్థాయిలో ఉన్న వారికి గౌరవ మర్యాదలు ఇవ్వడం, వయసులో చిన్న వారైనా ఉన్నత యోగ్యత కలిగిన వారిని వారి యోగ్యతకు విద్యుత్కు నమస్కరించడం మన సంస్కారం.
అయితే కాలాంతరంలో, రాజుల కాలంలో, నియంతల కాలంలో ఈ సంస్కారము గులమీ వ్యవస్థగా మారింది. యోగ్యత ఉన్నా లేకున్నా, కుల వ్యవస్థలో వచ్చిన మార్పులవల్ల, అదేవిధంగా ఆర్థికంగా ఎదిగిన వాళ్లు పవర్లో ఉన్న వాళ్ళు అంధకారంలో మునగడం వల్ల గౌరవం కాస్త gulami వ్యవస్థగా మారింది.
మనిషిని మనిషిగా చూడకుండా వారి రంగు రంగుల దుస్తులు, బహిర్గత హంగులను చూసి గౌరవ మర్యాదలు మన సంస్కృతి అసలే కాదు. భగవంతుడు ప్రతి మనిషిని సమానంగా పుట్టిస్తాడు. వారి వారి కర్మల వల్ల ఆయా స్థితులకు చేరుకుంటారు. కానీ భౌతిక జగత్తులో కేవలం ధనం, బలం, గౌరవాన్ని సంపాదించాలన్న మానసిక స్థితి అత్యంత దౌర్భాగ్యం. గౌరవాన్ని డబ్బుతో కొనాలన్న ఆలోచన అత్యంత శోచనీయం.
అయితే ఈ మధ్య కాలంలో కేవలం గులామీ తనంతో అయ్యగారు నిలబడితే నిలబడాలి, కూర్చున్నా నిలబడాలి, కూర్చోమని చెప్పేంతవరకు నిలబడాలి, వస్తున్నా పోతున్నా నిలబడాలి ఇవన్నీ గులమీ తనానికి నిదర్శనాలు. గౌరవం మనసులో నుంచి రావాలి. గౌరవం అంతః మనస్సుల్లోంచి రావాలి. బహ్యపు గౌరవ స్వరూపం గులామీకే నిదర్శనం. కేవలం అంతః మనసులో నుంచి వచ్చేదే అసలైన గౌరవం.
నవ జీవనంలో పెద్ద పెద్ద కార్లు అట్టహాసపు జీవనశైలి, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం గౌరవ లబ్ధి కోసమే. అన్నీ ఉన్నా ఏమీ లేని వాడికి గా సాధారణ జీవన విధానమే అసలు సిసలైన గౌరవ జీవనం. మర్యాదగా తాను వస్తున్నప్పుడు రెండు చేతులెత్తి నమస్కరిస్తే అది అసలైన గౌరవం.
స్థాయిలో ఉన్న వాడు సంతోషాన్ని అందరితో ముఖ్యంగా అధినస్థులతో పంచుకోవడం, దుఃఖంలో ఉన్నప్పుడు అది పైన కనిపించకుండా దిగమింగుకుని నమస్కారానికి ప్రతి నమస్కారం చిరునవ్వుతో చేయడమే గౌరవం.
వచ్చిన లాభాలను పంచుకోవడం, కష్టాన్ని తన వంతు గానే తనకు సమర్పించుకోవడం గౌరవం. కష్టాల్లో ఉన్న సామాన్యుడికి అండదండగా ఉండటం గొప్పతనం. తాను సంపాదించిన దాంట్లో కనీసం పదో వంతు సమాజపు సంస్కరణలకు పంచడమే సంస్కారం.
చౌరస్తాలో విగ్రహాలు పెట్టించడం కాదు, ప్రజల చిన్న చిన్న మనసులలో పెద్ద బొమ్మ కొట్టుకోవడమే మనిషి జీవిత గమనానికి అసలైన నిదర్శనం.
నవ జీవన విధానాలలో పవర్ పవర్ అనే ఉన్మాదం చాల ఘాతుకమైనది. ఇది సమాజాన్ని చిన్న విచ్చిన్నం చేయగలదు. ఏదో విధంగా పవర్లోకి ఉన్నత స్థాయిలోకి వస్తే గౌరవ మర్యాదలు డబ్బు తనంతట తానె వస్తాయన్న ఆలోచన అమానవీయం. పవర్ లోకి రావడానికి విచ్చలవిడిగా డబ్బు ఉపయోగించడం పవర్ లోకి వచ్చాక విచ్చలవిడిగా డబ్బు సంపాదించడమే విధానంగా మారడం మనల్ని ఆలోచింపజేస్తుంది. గౌరవమర్యాదలు ద్వారా, యోగ్యతల ద్వారా, కర్మఫలాల ద్వారా ఎన్నుకో బడడమే అసలు సిసలైన గౌరవం. వ్యవస్థ మారాలి. గౌరవ మర్యాదల పరిభాష మారాలి. వ్యవస్థలో మార్పు రావాలి. మనిషిని మనిషిగా వీక్షించడం అదేవిధంగా మనుషులలో మంచి నిర్మించడమే పెంపొందించడమే గౌరవ జీవన విధానం కావాలి.
- పరికిపండ్ల నరహరి
- 10th July 2019




Comments