top of page

Negotiation is an Art

  • Nov 28, 2025
  • 2 min read

ప్రశాసనిక క్షేత్రాలలో పని చేసేటటువంటి అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు చాలాసార్లు ఎన్నో వ్యవహారాలను negotiations అంటే చర్చలు చేయాల్సి వస్తుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా చాలాసార్లు పెద్ద పెద్ద కంపెనీల ఉన్నతాధికారులతో వ్యాపారవేత్తతో గవర్నమెంట్ కు అనుగుణంగా చర్చలు జరపాల్సి వస్తుంది. అదే విధంగా లేబర్ యూనియన్ ల నుండి కార్మిక సంఘాలు, ఎంప్లాయీస్ యూనియన్ నాయకుల తో చర్చలు జరిపి 'విన్ విన్ సిట్యుయేషన్' తీసుకు రావాల్సి వస్తుంది.


ఇలాంటి చర్చలు సఫలీకృతం కావాలంటే ఎలాంటి బిహేవియర్ (వ్యవహారికంగా) ప్రవర్తించాలి? చర్చను ఇరువురికి ఉపయోగంగా ఉండి ఇరువురికి మేమే గెలిచామని అనే విధంగా ఎలా మార్చుకోవాలి? చర్చల లో ఒక వర్గం ఇక మేము మాట్లాడం, మాకు అనుగుణంగా చర్చలు జరగడం లేదు, ఎదుటి వర్గం మా మాట వినడం లేదు, లేదా ఎదుటి వర్గం బాగా డామినేట్ చేస్తుంది అనే విధంగా కాకుండా సమంజసంగా చర్చలు జరగాలి.


ముందుగా పెద్దపెద్ద కంపెనీలలో వారి ఉన్నతాధికారులతో లేదా వ్యాపారవేత్తలతో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడూ ఈక్వాలిటీగా మేం ఇరువురం ఈక్వెల్స్ అనే విధంగా మాట్లాడాలి. ఎదుటివారి నియమ నిబంధనలను ధ్యానంగా విని దానికి అనుగుణంగా జవాబులు చెప్పుకుంటూ గవర్నమెంట్ కు లేదా కంపెనీకి అత్యధిక లాభం ఎలా జరగాలో దానికి అనుగుణంగా మాటను చమత్కారంగా ఉపయోగిస్తూ చర్చలు జరపాలి. ఎత్తుకు పై ఎత్తు వేయాలి ప్లాన్ ఏ, ప్లాన్ బి మరియు ప్లాన్ సి అని వేసుకుని ఒక కాగితంపై రాసి చర్చలు జరిపినట్టు అయితే కనీసం చివరి ప్లాన్ సి ప్రకారమైన చర్చలు సఫలీకృతమవుతాయి.


అదే కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు లేదా చిన్న స్థాయి లో ఉన్న వారైనా ముఖ్యమైన వారితో చర్చలు జరుపుతున్నప్పుడు చాలా వినమ్రతతో ప్రవర్తించాలి. ఎందుకంటే అలాంటి సంఘాలు వారి ప్రతినిధులు ముందుగానే మనల్ని గౌరవంగా చూస్తుంటారు. ఆ గౌరవాన్ని నిలబెట్టుకుని మరి వినమ్రతతో కొంచెం తగ్గి మాట్లాడినట్లయితే అలాంటి చర్చలు సఫలీకృతమవుతాయి. చిన్నచిన్న వాళ్ల మీద గవర్నమెంట్ డామినేట్ చేయకుండా లేదా రుబాబు చుపకుండా, కన్నెర్ర చేయకుండా సున్నితంగా వ్యవహరించాలి. ఇలాంటి సంఘాలు చిన్న చిన్న కోరికలతో గవర్నమెంట్ వారి కోసం ఏదో మంచి చేస్తుందని ఆలోచనలతో వస్తారు. కాబట్టి వారికి మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ చర్చలు జరపాలి.


ఎలాంటి రకంగా చూసుకున్నా గవర్నమెంట్ ఎప్పుడు డామినేటింగ్ పొజిషన్లోనే ఉంటుంది. అందుకని గవర్నమెంట్ అధికారులు గర్వంతో కాకుండా సబ్జెక్టు పరంగా చాలా బాగా తయారీతో చర్చలకు వెళ్లాలి. తయారీ లేకుండా చర్చలు జరిప కూడదు. అలాంటి చర్చలు విఫలమవుతాయి.


Negotiation స్కిల్స్లో posturing, proper పోజిషన్స్ లో కూర్చోవడం, ముఖ్య వక్త negotiator కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ మాట్లాడాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్ తో మాట్లాడాలి. చేతులు ఎక్కువగా ఉపకుండా, హావభావాలు తక్కువ సబ్జెక్ట్ ఎక్కువగా ఉపయోగించి మాట్లాడితే సార్థకత తప్పకుండా ఉంటుంది.


చర్చల అనంతరం ఇరువురు సంతోషంగా ఇంటికి వెళ్ళాలి. ఎవరి మనసులో నొప్పి ఉండకూడదు. అప శబ్దాలకు స్థానం ఉండకూడదు. మంచి మరియు మర్యాద పూర్వకంగా మాట్లాడాలి. వినమ్రత ఆభుషణం కావాలి. ఆ ఆభూషణమే కవచంగా ఉండాలి. చర్చల అనంతరం ఇరువురి మనసులలో ఒకరు అంటే ఒకరి మీద మర్యాద పెరగాలి. మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే చర్చలు సఫలం అవుతాయి.



15th November 2019,

Hyderabad

Comments


Hi, thanks for stopping by!

I am P Narahari, and this is my blog. I have worked in the government sector extensively, and would love to hear your thoughts - be it on this post or on any other topic which you think deserves to be discussed. 

  • Facebook
  • Instagram
  • Twitter
  • Pinterest

Share Your Thoughts with Narahari

Share your thoughts with Narahari

© 2025 by P. Narahari All rights reserved.

bottom of page