“GUJJARI GUJJARI MAMINDLA KINDA” Telugu Folk Song
- Nov 24, 2025
- 1 min read

తెలంగాణ తెలుగు జానపద (ఫోక్) పాటలలో ఈ మధ్య కాలంలో దుమ్మురేపిన పాట “గుజారి గుజారి మామిడ్ల కిందో నల్ల మామిడ్ల కింద”. గాయకులు ప్రభ (Prabha) మరియు స్వామి (Swamy), సంగీతం నవీన్ జె (Naveen J), అదనపు సాహిత్యం Sv మల్లిక్ తేజ (Sv Mallik Teja) అద్వర్యం లో LoveDuniyaa యూట్యూబ్ ఛానల్ లో అందరి ఆదరణ పొందింది ఈ పాట.
గుజారి గుజారి మామిడ్ల కిందో
నల్ల మామిడ్ల కింద
కుసుమరోళ్లేసినా కుందన బొమ్మ
అది కుందన బొమ్మ
ఇక్కడ గుజారి అంటే గుజ్జర్లు, గుర్జర్లు అని కూడా పిలువబడే గుజ్జర్లు జాతి ప్రజలు. వీరు ప్రాథమికంగా సంచార జాతులు. వారు తమ గృహోపకరణాలు, పశువుల సంతతి మరియు తమ కుటుంబాలతో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఒక సమూహంగా కదులుతూ ఉంటారు.
ఈ పాటలో ని గుర్జరు స్త్రీ మామిడి తోట కింద ఉందని రచయిత చెప్తూ ఆమె అందాన్ని అభివర్ణిస్తున్నాడు. గుజ్జర్లు సంచార జాతులు కాబట్టి వారు తమ సామాగ్రిని మరియు గుడారాన్ని కొన్ని చెట్ల కింద ఉంచుతారు, ఇక్కడ ఈ పాటలో వారు మామిడి తోటలో తమ గుడారాలను ఏర్పాటు చేసుకున్నారని ప్రస్తావించబడింది.
ఈ గుజ్జర్లు చిన్న అద్దాలతో పొదిగిన అందమైన దుస్తులను ధరిస్తారు. ఈ పాటలో కూడా ప్రధాన నటి గుజ్జరుల సాంప్రదాయ దుస్తులు ధరించి అందమైన లయబద్ధమైన బాణీలకు నృత్యం చేస్తుంది. ఇలాంటి పాట రాయాలంటే సమాజం మరియు సామజిక వర్గాల పట్ల 360 డిగ్రీ అవగాహన ఉండాలి.
గీత రచయితకు గ్రామీణ భారతదేశం గురించి బాగా అవగాహన ఉన్నట్టుంది. వివిధ కులాలు చేసే వివిధ వ్యవసాయ, ఉద్యానవన, చేతిపనులు, సేవా ఆధారిత పనులు పాటలో అందంగా వర్ణించబడ్డాయి.
కుసుమరోళ్లేసినా కుందన బొమ్మ
అది కుందన బొమ్మ
కుసుమరోళ్లూ అంటే కుమ్మరోళ్లు అని అర్థం. కుమ్మరోళ్లు కుండలపైనా మరియు వారు చేసిన అద్భుత కళా కండాల పైన చేతితో మంచి రంగులతో బొమ్మలు వేస్తారు. కుమ్మరోళ్లు వేసిన కుందనపు బొమ్మ లాగ అందంగా వుంది అమ్మాయి.
వడ్లోళ్లు జేసిన వన్నెల గజమా
ఓ వన్నెల గజమా
కమ్మరోళ్లు జేసిన గంటలపొన్నా
ఓ గంటలపొన్నా
పాటలోని లేడీ వడ్రంగులు రంగురంగులగా రూపొందించిన ఒక ధ్వజము చెక్కలా కనిపిస్తుంది. ఆమె కమ్మరి ప్రజలు (విశ్వకర్మలు) క్లిష్టమైన డిజైన్ లా అద్భుతంగా తయారు చేసిన కాంస్య గంటలా కూడా కనిపిస్తుంది అని కవి వర్ణిస్తున్నాడు. సాంప్రదాయ కళాకారులు తయారు చేసిన కళాఖండాలవలె ఆ లేడీ అందం కూడా అంతే క్లిష్టంగా వున్నది.
గౌంలోళ్ళు గీసిన పొత్తడి కల్లు
ఓ పొంగేటి కల్లు
ధమ్మరా దాగుదాము బింకుల కల్లు
మోటుకు దుంపల కల్లు
ఆ స్త్రీ అందాన్ని గౌడ సమాజం వారు తెల్లవారుజామున గీసే పొత్తడి (పోద్దాడి) కల్లుతో కూడా పోల్చినారు. ఆమె అందం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, ఆ అందాన్ని చూసే వారు ఉదయపు పోద్దాడి కల్లు మరియు పొంగేటి కల్లు తాగి పిచ్చివాళ్లవుతారు.
గోలోళ్ళు పిండిన గొర్రెల పాలు
అవి గోవుల పాలు
మందల్లా వట్టు పాలు సిట్టడా చాలు
పట్టి తాగిన మేలు
గొల్ల కురుమలు గొర్రెల నుండి పితికే మొదటి పాలు మరియు గోలోళ్ళు ఆవుల నుండి పితికే పాలు ఎంత స్వచ్ఛమైనవి! అంతటి స్వచ్ఛ మైన అందామని చెప్పబడింది.
తెనుగోళ్ళు ఇచ్చిన సిల్పకపళ్ళు
తేనే మామిడిపళ్ళు
తియ్యంగా తిందామె తీరొక్కపళ్ళు
చిలక నేరడిపళ్ళు
తెనుగు సమాజం పండించే సీతాఫల్, నేరడి, మామిడి మరియు ఇతర వెరైటీ పండ్ల మాదిరిగా ఈ అందం తియ్యగా వున్నదని చెప్పబడింది.
కాపోళ్ళు ఇచ్చిన మక్కా కంకులు
అవి పాల కంకులు
కాల్చుకోని తిందాము కంది కాయలు
పచ్చి పల్లి కాయలు
ఈ పాట లోని స్త్రీ కూడా లేత వయస్సులో వుండి కాపు సమాజం పండించే లేత మొక్కజొన్న లాంటిదని చెప్పడం జరిగింది. ఈ మొక్కజొన్న పాల రుచిని కలిగి ఉండే తొలి మొక్కజొన్నతో అందాన్ని పోల్చారు కవి.
GUJJARI GUJJARI MAMINDLA KINDA Song Lyrics in Telugu
డోప్-ఎడిటింగ్-డైరెక్షన్: శివ వేలుపుల (Shiva Velupula)గాయకులు: ప్రభ (Prabha) & స్వామి (Swamy)సంగీతం: నవీన్ జె (Naveen J)అదనపు సాహిత్యం: Sv మల్లిక్ తేజ (Sv Mallik Teja)నటీనటులు: అక్షిత్ మార్వెల్ (Akshith Marvel) – వైష్ణవి సోనీ (Vaishnavi Sony)సాగర్ మచ్చ (Sagar Macha) – శ్రావ్య రెడ్డి (Sravya Reddy)కడారి మానస (Kadari Manasa) – కర్ణాకర్ (Karnakar)కొరియోగ్రఫీ: రాజేష్ పైండ్ల (Rajesh Paindla)
24th November 2025




Comments