సిత్తమే బావ
- Mar 18
- 1 min read

సిత్తమే బావ
సిన్నంగ నన్నే జూసి సైగ జెత్తంటే
సిత్తమే బావ
సిన్ని గుండెల్లోనా నువ్వే గూడే కడతంటే
సిత్తమే బావ
సిన్నంగ నన్నే జూసి సైగ జెత్తంటే
సిత్తమే బావ
సిన్ని గుండెల్లోనా నువ్వే గూడే కడతంటే
సీర కొంగు సిద్ధమన్నది
నిన్ను కొంగు కట్టుకోమని
ప్రేమ రంగు నే పూసుకొని
సుత్తవున్న నేను నీదాన్ని
సిత్తమే బావ
సేసుకుంట నిన్ను నావాన్ని
నువ్వు నా సొంతం అని
సిత్తమే బావ
రాము రాథోడ్ ఛానల్ లో ఈ మధ్య కాలంలో వచ్చిన ఈ ఫోక్ పాటని “రాను బొంబాయికి రాను” తో ఫేమస్ అయిన రాము రాథోడ్ రాస్తే కళ్యాణ్ కీస్ మ్యూజిక్ అందించారు.
ఈ పాటమొదలు ‘సిత్తమే’ అనే పదం ‘చిత్తమే’ అనే పదానికి వికృతం. తెలంగాణ యాసలో చిత్తమే అనే పదం బదులుగా సిత్తమే అని అంటారు. ఇక్కడ ‘సిత్తమే బావ’ అంటూ నేను ఒప్పుకుంటున్నాను, నేను రెడీ బావ అని చెప్పడం. ‘నువ్వు ఎట్లా చెప్పితే నేను అట్లనే’ అని కూడా మీనింగ్ వస్తది.
పిట్ట ఒకటే రకమైన పుల్లలతో గూడు కట్టినట్టు రాము రాథోడ్ ఆ ఒక్క పదానితో అద్భుతంగా పాటని అల్లినాడు. మరదలు తన బావ ప్రేమను అంగీకరిస్తున్నట్టు, తనతో జీవిత కాలం సహవాసంకు సై అన్నట్టు సిత్తమే అని చెప్పుతున్నది.
చిత్తము అంటే మనస్సు, హృదయం, బుద్ధి, లేదా ఇష్టము (Will/Mind) అని అర్థం. ఇది సంస్కృత సమమైన పదం. సాధారణంగా వినయపూర్వకంగా అంగీకారం తెలిపేటప్పుడు (చిత్తం ప్రభూ) లేదా అభిప్రాయాన్ని, కోరికను (దేవుని చిత్తము) తెలపడానికి దీనిని ఉపయోగిస్తారు.
చిత్తము - అర్థాలు & నానార్థాలు:
మనస్సు (Mind): ఆలోచనలకు నిలయం.
బుద్ధి/మతి (Intellect): నిర్ణయం తీసుకునే సామర్థ్యం.
ఇష్టము/అభిప్రాయం (Will/Wish): కోరిక.
హృదయం (Heart): అంతరంగం.
వాడుక ఉదాహరణలు:
చిత్తం (Chittam/As you wish): "చిత్తం, మహాప్రభో" - ఆజ్ఞను అంగీకరించేటప్పుడు.
దేవుని చిత్తము (God's Will): "అంతా దేవుని చిత్తము" - భగవంతుని ఇష్టాన్ని సూచించేటప్పుడు.
చిత్త చాంచల్యం (Mindlessness/Unsteadiness):మనస్సు ఒక స్థిరమైన నిర్ణయానికి రాలేకపోవడం.
17th March 2026




Comments