top of page

ఏడడుగులు ఏడు జన్మలు ఇక అంతేనా?

  • Mar 24
  • 1 min read

మన సనాతన ధర్మంలో పెళ్ళంటే ఏడడుగులు, ఏడు జన్మల బంధం. హైందవ ధర్మంలో పెళ్లి అనే మాట వుంది కానీ ఆ పదానికి వ్యతిరేక పదం అసలు పుట్టనే లేదు. విడాకులు అని ఒక పదం పుట్టుకొచ్చిన అని ధార్మిక పదం కానే కాదు. ఎందుకంటే మన పూర్వీకులు పెళ్లి తరువాత ‘వివాహ విచ్ఛేదనం’ అనే విషయం గురించి ఆలోచించనేలేదు, మరీ అలాంటి విచ్ఛేదనానికి రూల్స్ పెట్టనేలేదు.

 

అదే క్రైస్తవులలో, ఇస్లాంలో పెళ్ళంటే ఒక కాంట్రాక్ట్ బంధం. ఆ కాంట్రాక్ట్ వున్నంత వరకే పెళ్లి. ఆ తరువాత క్రైస్తవులలో వెడ్డింగ్ కి డివోర్స్, ఇస్లాంలో నికా కి తలాక్ అని ముందే ఆ మత పెద్దలు నిర్ణయించారు.

 

మన హిందువులకి సీత రాములు ఆదర్శ దంపతులు. తెలుగువారి వివాహ వేడుకల్లో సీతారాముల కళ్యాణానికి సంబంధించిన పాటలు ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా "సీతాకల్యాణ వైభోగమే" (త్యాగయ్య కీర్తన), "సీతారాముల కళ్యాణం చూతము రారండి" (సీతారామ కళ్యాణం - 1961) వంటి పాటలు వివాహాల్లో తప్పనిసరిగా వినబడతాయి. ఇవి భక్తిని, ఆనందాన్ని పంచుతాయి. సీత రాముల కళ్యాణం అంటేనే  ఏడడుగులు, ఏడు జన్మల బంధం, జన్మ జన్మల బంధం.

 

సీతారాముల వివాహానికి సంబంధించిన కొన్ని ప్రసిద్ధ పాటలు/కీర్తనలు:

  • సీతాకల్యాణ వైభోగమే (త్యాగరాజ కీర్తన): ఇది పెళ్లి తలంబ్రాల సమయంలో అత్యంత ఎక్కువగా వినిపించే కీర్తన.

  • సీతారాముల కళ్యాణం చూతము రారండి (సినిమా: సీతారామ కళ్యాణం, 1961): సముద్రాల సాహిత్యం అందించిన ఈ పాట తెలుగు వివాహ వేడుకలకే కాక, శ్రీరామనవమికి కూడా ప్రసిద్ధి.

  • జానకి దోసిట కెంపుల ప్రోవై (సినిమా: సీతారామ కళ్యాణం, 1961): తలంబ్రాల సన్నివేశాన్ని వర్ణించే పాట.

  • సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి (భక్తి గీతం): పెళ్లి పాటలకు ఇది ఒక ప్రత్యేక శైలి. 

 

ఈ పాటలు శ్రీరాముడు, సీతాదేవి వివాహ మహోత్సవాన్ని ఎంతో అద్భుతంగా, పవిత్రంగా వర్ణిస్తాయి. సీతారాముల కల్యాణం నిత్య నూతనంగా, జానకి రామునితో జతకట్టడాన్ని, తలంబ్రాల వేడుకను ఈ పాటలు కళ్ళకు కట్టినట్లు చూపుతాయి. మరి ఈ పాటలన్నీ ఏమీ కాను? వాటి అర్థం, భావార్థం ఏమైపోను?

 

ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది... ఎన్నటికి మాయని మమతా నాది నీది 

ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను.. ఒక్క క్షణం నీ విరహం నేతాళలేను 

ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది... ఎన్నటికి మాయని మమతా నాది నీది

 

ప్రస్తుత కాలం లో వివాహం అనేది ఈ జన్మకే, ఈ జన్మలో కొంత కాలం వరకే, డివోర్స్ లో పెరిగి పోతున్నాయి. 

మరి మన ‘ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది’ ఏమీ కాను?

మన పెళ్లిల్లంటే ఏడడుగులు, ఏడు జన్మల బంధం ఏమైపోను? సీనియర్ యాక్టర్ నరేష్ ఈ మధ్యకాలం లో “మళ్లీ పెళ్లి” అని సినిమా తీసి ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. నరేష్ కి నిజ జీవితంలో నాలుగవ పెళ్లి సుమ. ఆరు పదులలో భాగస్వామిని కోల్పోతే పిల్లలే ఇంకో భాగస్వామిని వెతికి పెళ్లి చేస్తున్నారు. ఇది ఇంకా కొత్త ట్రెండు.

 

“మాంగళ్యం తంతునానేన

మమ జీవన హేతునా

కణ్ఠే బధ్నామి సుభగే

త్వం జీవం శరదాం శతమ్”

అంటూ తాళి కట్టే వరుడు, వధువును నువ్వు నూరేళ్లు బ్రతకాలని కోరుకోకపోయినా, భర్తే ప్రమేశ్వరుడు అని రోజు తాళి కళ్లకద్దుకొని ఆయనగారి పాద పద్మమ్ములకు మొక్కకపోయిన కనీసం ఒకరినొకరిని గౌరవించుకొని ఈ జన్మకి ఆదర్శ దాంపత్యం కాకపోయినా, గౌరవప్రదంగా ఒకరంటే ఒకరి మీద అభిమానంతో జీవించితే అదే పదివేలు.

 

వరకట్న వేధింపులతొ భార్యని చంపే ఆ రోజులకన్న, భర్తను డ్రమ్ముల్లో పాతిపెట్టే ఈ రోజులకన్నా, ఏదో ఒక రకంగా, కష్టాల్లో సుఖాల్లో “నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేను” అని పిల్లాపాపలతో హాయిగా వుంటూ మూడో వ్యక్తి దాంపత్య జీవితంలో ప్రవేశించకుండా, ఎప్పుడో చిన్నప్పుడు లైన్ వేసిన వ్యక్తి ఫేస్బుక్ లో పరిచయమైనా చూసి చూడనట్టు వదిలేస్తే, ఆఫీసులో కలీగ్ ని సిస్టర్ లా చూడకపోయినా కేవలం కలీగ్ వరకే ఆపేస్తే దాంపత్యం కలకాలం కాకున్నా ఈ జీవితానికి ఇది చాలు అనే విధంగా ఉంటాయి మరి. శుభం.


24th March 2026

 
 
 

1 Comment


ANPR PROJECTS PRIVATE LIMITED
ANPR PROJECTS PRIVATE LIMITED
Apr 02

మేము ఈ బ్లాగును మా స్నేహితులతో పంచుకున్నాము; వారు దీనిని చూసి చాలా సంతోషించారు ముఖ్యంగా సంప్రదాయ హిందూ వివాహం మరియు విడాకులకు సంబంధించిన వివిధ అర్థాల విషయంలో... ధన్యవాదాలు, అన్నా. మీ తమ్ముడు, పల్నాటి గోపాల కృష్ణ

Like

Hi, thanks for stopping by!

I am P Narahari, and this is my blog. I have worked in the government sector extensively, and would love to hear your thoughts - be it on this post or on any other topic which you think deserves to be discussed. 

  • Facebook
  • Instagram
  • Twitter
  • Pinterest

Share Your Thoughts with Narahari

Share your thoughts with Narahari

© 2025 by P. Narahari All rights reserved.

bottom of page